సైనా ఔట్‌

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

సైనా ఔట్‌

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. సైనా 16-21, 14-21తో ప్రపంచ నం.20 అయ ఒహోరి (జపాన్‌) చేతిలో పరాజయంపాలైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-9, 21-7తో సౌరభ్‌ వర్మపై విజయం సాధించాడు. ప్రణయ్‌ 18-21, 19-21తో ఆరో సీడ్‌ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో ఓడాడు. గాయం కారణంగా కశ్యప్‌.. చౌ టీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో మ్యాచ్‌ ఆరంభంలోనే నిష్క్రమించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌-అశ్విని 17-21, 21-14, 11-21తో యాన్‌-డు యు (చైనా) చేతిలో, మహిళల డబుల్స్‌లో మేఘన-పూర్వీషా 8-21, 7-21తో నీతా-సయాక (ఇండోనేషియా) చేతిలో, అశ్విని-సిక్కి 17-21, 13-21తో లీ-షిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన