క్వార్టర్స్‌లో సింధు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

క్వార్టర్స్‌లో సింధు

శ్రీకాంత్‌ పరాజయం

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ సింధు 21-16, 12-21, 21-15తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-23, 9-21తో టాప్‌ సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ధ్రువ్‌- సిక్కిరెడ్డి 17-21, 21-19, 11-21తో టాంగ్‌ చున్‌- యింగ్‌ సూట్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడారు. 67 నిమిషాల పాటు సాగిన పోరులో బుసానన్‌ను సింధు మట్టికరిపించింది. ప్రత్యర్థిపై 13-1తో గెలుపోటముల రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. మొదటి గేమ్‌ను సింధు సొంతం చేసుకోగా.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను సింధు దూకుడుగా ప్రారంభించింది. 7-4తో ఆధిక్యం సంపాదించిన సింధు 11-6తో ముందంజ వేసింది. 19-11తో సింధు మ్యాచ్‌ దిశగా దూసుకెళ్తుండగా బుసానన్‌ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుని ఉత్కంఠ రేపింది. నాలుగో పాయింటు సాధించే క్రమంలో బుసానన్‌ షాట్‌ ఆడగా.. షటిల్‌ కోర్టు బయటపడింది. దీంతో 20-14తో సింధు మ్యాచ్‌ పాయింటుకు చేరువైంది. తర్వాతి పాయింటు బుసానన్‌ ఖాతాలోకి వెళ్లగా.. అద్భుతమైన క్రాస్‌కోర్ట్‌ షాట్‌తో పాయింటు రాబట్టిన సింధు 21-15తో ఉత్కంఠకు తెరదించింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ యాన్‌ సియంగ్‌ (కొరియా)తో సింధు తలపడనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన