కేంద్ర ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ‘ధిక్కార చర్యలు’ నిలిపివేత
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ‘ధిక్కార చర్యలు’ నిలిపివేత

వారిని జైల్లో పెడితే ఆక్సిజన్‌ వస్తుందా అని సుప్రీం ప్రశ్న

దిల్లీ: ఆక్సిజన్‌ సరఫరా విషయంలో తమ ఆదేశాలను ధిక్కరించారంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులపై దిల్లీ హైకోర్టు తీసుకోదలచిన చర్యలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. సంబంధిత ఉన్నతాధికారులను జైల్లో పెట్టడం వల్ల ప్రాణవాయువు రాదని, కొవిడ్‌ బాధితులను రక్షించేందుకు నిర్దిష్ట ప్రయత్నాలు అవసరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తాము సూచించినట్టు దిల్లీకి నిత్యం 700 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను అందించడంలో విఫలమయ్యారని; తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఇందుకు సంజాయిషీ చెప్పాలని... కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌ గోయల్‌, పారిశ్రామిక-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అదనపు కార్యదర్శి సుమితా దావ్రాలను హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాలుచేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి... హైకోర్టు చర్యలను నిలుపుదల చేసింది. అయితే- కొవిడ్‌-19 పర్యవేక్షణ విషయంలో హైకోర్టును తాము అడ్డుకోబోమని సుస్పష్టం చేసింది. ‘‘కరోనా యావద్దేశ విపత్తు. ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తోంది. అయినా ప్రజలు చనిపోతున్నారు. వీటినెవరూ ప్రశ్నించజాలరు. అయితే... ప్రాణవాయువు అందించే విషయంలో సహకారం అవసరం. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఆక్సిజన్‌ రాదు. కేంద్ర, రాష్ట్ర అధికారులు వీడియో ద్వారా సమావేశమై... దేశ రాజధానికి ఆక్సిజన్‌ను సరఫరాచేసే విషయమై చర్చించాలి. 700 టన్నుల ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాకు నివేదిక సమర్పించాలి’’ అని ధర్మాసనం సూచించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి విషయంలో సమస్య లేదని, దాన్ని సరఫరా చేసేందుకు అవసరమైన కంటైనర్ల విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయని హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన