మెల్‌బోర్న్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

మెల్‌బోర్న్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

కాన్‌బెర్రా: కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పలు ప్రధాన నగరాలు అప్రమత్తమవుతున్నాయి. సిడ్నీ, బ్రిస్బేన్‌ ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించగా.. తాజాగా మెల్‌బోర్న్‌ కూడా వాటికి జత కలిసింది. ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌. విక్టోరియా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలో.. తాజాగా 8 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో ఏడు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు విక్టోరియా ప్రభుత్వ అధినేత డేనియల్‌ ఆండ్రూస్‌ గురువారం ప్రకటించారు. ఆస్ట్రేలియాలో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇంతవరకు కేవలం 20% మందికే రెండు డోసులు అందాయని పేర్కొన్నారు. అందుకే గత్యంతరం లేక తాము మెల్‌బోర్న్‌తో పాటు విక్టోరియా రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన