23వేల ఏళ్ల నాటి మానవ పాదముద్రలు

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:01 IST

23వేల ఏళ్ల నాటి మానవ పాదముద్రలు

వాషింగ్టన్‌: అమెరికాలోని న్యూమెక్సికోలో మానవ పాదముద్రలతో కూడిన శిలాజాలు వెలుగు చూశాయి. దీన్ని బట్టి ఉత్తర అమెరికాలో 23వేల ఏళ్ల కిందటే మనుషులు సంచరించారని స్పష్టమవుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వైట్‌ శాండ్స్‌ నేషనల్‌ పార్క్‌లో ఎండిపోయిన ఒక చెరువులో ఇవి కనిపించాయి. అమెరికా భూగర్భ పరిశోధన అధికారులు.. ఈ పాదముద్రల్లో కూరుకుపోయిన విత్తనాలను విశ్లేషించారు. తద్వారా వాటి వయసును నిర్ధరించారు. అవి దాదాపు 22,800 నుంచి 21,130 ఏళ్ల కిందటివని గుర్తించారు. ఆసియా నుంచి అలాస్కాకు మధ్య నేడు నీటమునిగిన ఒక నేల వంతెన ద్వారా పురాతన వలసలు మొదలయ్యాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాతి పనిముట్లు, శిలాజ ఎముకలు, జన్యు విశ్లేషణ ఆధారంగా అమెరికా ఖండాల్లోకి మానవులు 13వేల నుంచి 26వేల ఏళ్ల కిందట వచ్చి ఉంటారని గుర్తించారు. తాజా పాదముద్రలు దీనిపై నిర్దిష్ట ఆధారాలను అందిస్తున్నాయి. వీటి పరిమాణాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అవి చిన్నారులు, కౌమార ప్రాయులకు సంబంధించినవని తేల్చారు. వారు మంచు యుగంలో అక్కడ నివసించారని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన