నూతన పార్లమెంటు పనులను పరిశీలించిన ప్రధాని

ప్రధానాంశాలు

Updated : 27/09/2021 05:17 IST

నూతన పార్లమెంటు పనులను పరిశీలించిన ప్రధాని

ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం రాత్రి నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రాత్రి 8.45 గంటల నుంచి గంటపాటు ఆయన నిర్మాణ స్థలంలోనే కలియతిరిగి అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో మాట్లాడారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆయన పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించడం విశేషం. వచ్చే ఏడాది ఆగస్టుకల్లా ఈ భవన నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేసి, ఆ వెంటనే వచ్చే శీతాకాల సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన