టీకా పాత్ర తెలిసిన తండ్రి!

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

టీకా పాత్ర తెలిసిన తండ్రి!

చిన్నారికి టీకా ప్రాధాన్యం గుర్తెరిగిన ఓ తండ్రి వరదను సైతం లెక్క చేయక.. తన బుజ్జాయిని వెడల్పాటి గిన్నెలో ఉంచి ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చిన ఘటన ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సిర్సా గ్రామంలో శిశువుకు పోలియో టీకా వేయించాలని భావించిన ఓ తండ్రికి.. కుండపోత వర్షం కారణంగా ఒక్క వాహనమూ దొరకలేదు. పైగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని అతడు దాటాల్సి ఉంది. దీంతో చిన్నారిని ఓ పాత్రలో పెట్టి, వరదను దాటుకుంటూ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అలా చిన్నారితో సహా వచ్చిన వ్యక్తిని చూసి ఆరోగ్య సిబ్బంది చలించిపోయారు. వెంటనే శిశువుకు పోలియో టీకా వేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన