ఉత్తరాఖండ్‌లో విషాదం

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

ఉత్తరాఖండ్‌లో విషాదం

12 మంది పర్వతారోహకుల దుర్మరణం

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌ కోసం రెండు వేరు వేరు బృందాలుగా వెళ్లిన పర్వతారోహకుల్లో 12మంది మరణించారు. వీరి మృతదేహాలను లంఖాగా పాస్‌ వద్ద అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురిని రక్షించగా.. మరో నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలోని చిత్‌కుల్‌కు.. ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్‌కు లంఖాగా పాస్‌ అనుసంధానంగా ఉంటుంది. హర్షిల్‌ వద్ద పర్వతారోహకులు గల్లంతయ్యారన్న వార్త తెలుసుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్టు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. తొలుత.. 11 మంది సభ్యుల బృందంలో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు, మరో ఇద్దరిని రక్షించినట్టు, మరో ఇద్దరు గల్లంతైనట్టు ఆయన వివరించారు. అనంతరం మరో 11 మంది సభ్యులతో కూడిన బృందంలో 5 మృతదేహాలు లభించాయని, నలుగురిని కాపాడినట్టు, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా అందలేదని వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన