రైతులు వద్దంటున్నా.. వారాంతపు లాక్‌డౌన్‌ విజయవంతం
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతులు వద్దంటున్నా.. వారాంతపు లాక్‌డౌన్‌ విజయవంతం

చండీగఢ్‌: సాగు చట్టాలపై ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు కొవిడ్‌ కారణంగా పంజాబ్‌ ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నా.. శనివారం తమ దుకాణాలకు తాళాలు వేసి దుకాణదారులు అదికారులకు సహకరించారు. పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ వీధి ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లో పర్యటించి దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులను కోరాయి. కొవిడ్‌ సంక్షోభ నివారణకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని భారతీ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం పోలీసు అధికారులతో సమీక్ష జరిపిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వారాంతపు లాక్‌డౌన్‌ను అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో  లాక్‌డౌన్‌ అమలుకు శనివారం ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలకు వ్యతిరేకంగా మేము వెళ్లలేం. రాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని పాటిస్తాం. ఈ విషయం రైతులకు కూడా చెప్పాం’ అని పంజాబ్‌ ప్రదేశ్‌ వ్యాపార మండలి ప్రధాన కార్యదర్శి సమీర్‌ జైన్‌ స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన