Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009310
            [news_title_telugu_html] => 

ఉత్పాదన తగ్గించిన అశోక్‌ లేల్యాండ్‌

[news_title_telugu] => ఉత్పాదన తగ్గించిన అశోక్‌ లేల్యాండ్‌ [news_title_english] => Auto Employees Scared About Next Month salaries Says Ashok Leyland Staff [news_short_description] => ట్రక్కుల అమ్మకాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తన తయారీ ప్లాంట్‌లలో వాహన ఉత్పాదనను ఉన్నట్టుండి తగ్గించింది. ఈ నెలలో కొన్ని ప్లాంట్లను 5 నుంచి 18 రోజుల పాటు మూసివేసింది. ఈ పరిణామం ఉద్యోగులను కలవరపరుస్తోంది. [news_tags_keywords] => Auto Crisis, Ashok Leyland, Chennai Plant, Truck Sales [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 21:49:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉత్పాదన తగ్గించిన అశోక్‌ లేల్యాండ్‌ - Auto Employees Scared About Next Month salaries Says Ashok Leyland Staff - EENADU
close

తాజా వార్తలు

ఉత్పాదన తగ్గించిన అశోక్‌ లేల్యాండ్‌

కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు

చెన్నై: ట్రక్కుల అమ్మకాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తన తయారీ ప్లాంట్‌లలో వాహన ఉత్పాదనను తగ్గించింది. ఈ నెలలో కొన్ని ప్లాంట్లను 5 నుంచి 18 రోజుల పాటు మూసివేసింది. ఈ పరిణామం ఉద్యోగులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క చెన్నై ప్లాంటులోనే దాదాపు మూడు వేల మంది వరకూ ఒప్పంద ఉద్యోగులు ఉండగా వారికి నెలవారీ వేతనాలను సగానికి పైగా తగ్గించి ఇస్తోందని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. రూ.13 వేలు వేతనం ఇవ్వాల్సిన వారికి రూ.4 వేలు జమ చేస్తుండడంతో చిరుద్యోగులు సతమతమవుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ‘పని లేదు-వేతనమూ లేదు’ (నో వర్క్‌-నో వేజ్‌) విధానం అమలవుతోందని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామన్‌ వెల్లడించారు. మరోవైపు సాధారణ ఉద్యోగులకు సైతం జీతంలో కోత విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
గతేడాది ఇదే సమయానితో పోలిస్తే అశోక్‌ లేల్యాండ్‌ వాహన అమ్మకాలు 50 శాతం పడిపోయాయి. 2018 ఆగస్టులో లారీలు, బస్సుల అమ్మకాలు 16,628 ఉండగా, గత నెలలో 8,296 మాత్రమే నమోదు కావడం సంస్థ ఉద్యోగులను కలవరపరుస్తోంది. 
బీఎస్‌-6 వాహనాల విషయంలో తొలుత ప్రభుత్వ విధానాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి మళ్లడం, జీఎస్టీ వంటి పరిణామాలు ముఖ్యంగా వాణిజ్య వాహన పరిశ్రమను పీడిస్తున్నాయి. దీనివల్ల అమ్మకాలు 54 శాతం పడిపోయాయి. గత నెలలో 51,897 వాహనాలు అమ్ముడు కాగా, 2018 ఆగస్టులో 84,668 కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం వాహనాలపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలని ఈ పరిశ్రమ కోరుకుంటోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.