close

తాజా వార్తలు

విధులకు వర్ణరంజితంగా

అల్మారా నిండా దుస్తులు కుప్పలుగా కనిపిస్తోన్నా... ఆఫీసుకు వేసుకెళ్లేందుకు ఏవీ లేవంటారు చాలామంది ఉద్యోగినులు. అలాగని తరచూ కొత్తవి కొనడం పరిష్కారం కాదు కదా. అందుకే  ఉన్న దుస్తులకు చిన్నచిన్న మార్పులు చేసుకుని ఎప్పుడూ మెరిసిపోయే ప్రయత్నం చేయండి... అంటున్నారు నిపుణులు.
కుర్తాలు... మన దగ్గర చాలానే ఉంటాయి. వాటిని లెగ్గింగ్‌, పలాజో, జీన్స్‌లతో ఎన్నాళ్లని వేసుకుంటారు. ఈసారి ఎలాంటి డిజైను ఉన్న కుర్తా అయినా సరే దానికి నప్పే రంగులో డెనిమ్‌ప్యాంటు వేసుకుని చూడండి. ఈ ఇండోవెస్ట్రన్‌వేర్‌తో మీదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ సృష్టించినవారవుతారు. ఇంకా భిన్నంగా ఉండాలనుకుంటే కుర్తీని బట్టి దాని మీదకు ష్రగ్‌ లేదా జాకెట్‌ వేయండి. బ్లాక్‌ప్రింటు, ఎత్నిక్‌ జాకెట్‌, బోహో డిజైను, ఎంబ్రాయిడరీ చేసింది... ఇలా చాలా రకాలే దొరుకుతున్నాయి ఇప్పుడు. రెండు కొని పెట్టుకుంటే మార్చిమార్చి వేసుకోవచ్చు.
* దుస్తులు సౌకర్యంతోపాటు భిన్నంగానూ కనిపించాలంటే ఎప్పుడూ జీన్స్‌లే వేసుకోవాలని లేదు. బోహో తరహాలో ఉండే పలాజో దానికి జతగా గుండీలున్న చొక్కా ప్రయత్నించండి. మీ ఆహార్యమే మారిపోతుంది.
* వెడల్పుగా ఉండే ఫ్లేర్డ్‌ స్కర్టులపై టీషర్టులు లేదా పొడవాటి బ్లౌవుజులే వేసుకోవాలని లేదు. కుర్తీ కూడా అదిరిపోతుంది. అలాని ప్రింట్లు అతిగా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ స్కర్టు ప్రింటు ఉన్నదయితే... సాదా కుర్తీ చాలు. ఇంకా భిన్నంగా ఉండాలంటే అదనంగా ఓ ప్రింటెడ్‌ స్టోల్‌ జత చేయండి.

* ఎప్పుడూ సల్వార్‌, చుడీదార్‌ వంటివే వేసుకోవాలనేం లేదు. పలాజో, పటియాలాకు భిన్నంగా ధోతీప్యాంట్లు వేసుకోవచ్చు. కాస్త పొడవు తక్కువగా కుర్తీ, జ్యూతీలు, జోలీ బ్యాగు ఉండేలా జత చేసుకుంటే సరిపోతుంది.
* ఉద్యోగినులు ప్రత్యేక సందర్భాల్లో చీరలు కట్టుకోవడం పరిపాటే. ఈసారి అలా కట్టుకుంటున్నప్పుడు క్రాప్‌టాప్‌ బ్లవుజును ప్రయత్నించండి. కుదిరితే ఒకచేతి నిండా గాజులు, సన్నటి గొలుసు, లోలాకులు పెట్టుకుంటేఆకట్టుకునేలా కనిపిస్తారు. ఇంకా భిన్నంగా కనిపించాలనుకుంటే కాటన్‌చీరమీదకు షర్టు తరహాలో కుట్టిన బ్లవుజు కూడా వేసుకోవచ్చు.
* రిప్డ్‌ జీన్స్‌ ఫ్యాషన్‌ ఎప్పటికీ వన్నె తగ్గదు. దానిమీదకు పొట్టి కుర్తీ ఉండేలా చూసుకోవాలి. ప్యాంట్లు వేసుకుంటున్నప్పుడు ట్రైబల్‌, ఆఫ్గానీ నగలు బాగుంటాయి. ముఖ్యంగా వెండిరంగులో మెరిసిపోయేవి ఉండేలా చూసుకోవాలి. పొడవాటి హూప్స్‌, బ్యాక్‌ప్యాక్‌, ఎత్తుమడమల చెప్పులూ కొత్తగా కనిపించేలా చేస్తాయి.
* ఇది వేసవి కాబట్టి.. జీన్స్‌ మీదకు పోలో షర్టు ప్రయత్నించడం మంచిది. చెమట సమస్య ఇబ్బంది పెట్టదు. ట్రెండీలుక్‌తో కనిపిస్తారు. ఒకవేళ సిగిరెట్‌ ప్యాంట్లు వేసుకుంటుంటే... దానిమీదకు పొడవాటి కుర్తా వేసుకుంటే ఆ అందమే వేరు.


ట్రెండ్‌ ఎందుకు...

నలుగురిలోకి వెళ్తాం కాబట్టి... ఎప్పుడూ ట్రెండ్‌ని అనుసరించాలని అనుకుంటారు ఉద్యోగినులు. కానీ అవసరంలేదు. కొన్నిరకాల దుస్తులు అందుబాటులో పెట్టుకుంటే... ఎప్పటికప్పుడు ఆకట్టు కునేలా కనిపించొచ్చు. ఎలాగంటే...
* నీలం, నలుపు రంగు జీన్స్‌ ప్యాంట్లు,  కాటన్‌ప్యాంట్లు, జెగ్గింగ్‌లు, పలాజోలు, ధోతీప్యాంట్లు, లెగ్గింగ్‌లు ప్రాథమిక రంగుల్లో అందుబాటులో పెట్టుకోవాలి.
* కుర్తాలతోపాటు పూల ప్రింట్లు ఉన్న షర్టులు రెండు రకాలు ఉండేలా చూసుకోవాలి.
* ఇది వేసవి కాబట్టి... లినెన్‌, కాటన్‌,  ఖాదీ చీరలు లేత రంగుల్లో సిద్ధంచేసుకుని బ్లవుజులు భిన్నంగా కుట్టించుకోండి.
* దుస్తులమీదకు జుంకాలు, స్టడ్స్‌, పొడవాలి షాండ్లియర్‌ ఇయర్‌రింగ్స్‌ మార్చిమార్చి పెట్టండి. అలాగే ఫ్లాట్స్‌, రెండుఅంగుళాల ఎత్తున్న చెప్పులు సందర్భానుసారంగా వేయాలి. వీలైతే వస్త్రంతో కుట్టిన బ్యాగులు వాడితే మేలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.