Poonch attack: ‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి

ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. 

Updated : 08 May 2024 17:01 IST

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌ (Jammu and Kashmir)లో పూంఛ్‌ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు గత శనివారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు గాయపడగా.. అందులో ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిని దగ్గరుండి చూసిన ఒక వ్యక్తి ఆ రోజు జరిగిన దాడి గురించి వెల్లడించారు.(Poonch attack)

‘‘ఆ సమయంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. 20 నిమిషాల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ శబ్దాలకు నా పిల్లలు భయపడిపోయి, ఏడ్వడం మొదలుపెట్టారు. కొంతమంది సైనికులకు గాయాలయ్యాయని, అందులో ఒకరు మరణించారని తర్వాత తెలిసింది. ఈ ప్రాంతమంతా చెట్లు దట్టంగా ఉండటంతో ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారో కచ్చితంగా తెలియలేదు. ఈ ప్రాంతంలో ఇలా ఒక ఎన్‌కౌంటర్ జరగడం ఇదే తొలిసారి. ఆ సమయంలో నా పిల్లల భద్రత గురించి భయం వేసింది. ఉగ్రవాదుల కోసం బలగాలు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి’’ అని ఆ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఉగ్రదాడి అనుమానితుల ఫొటోలను సైన్యం విడుదల చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్పొరల్‌ పహాడే.. తన పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేవారని, వారితో సరదాగా ఆడేందుకు ఆగేవారని ఆ వ్యక్తి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు