close

తాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా తన సందేశాన్ని అందించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ వాసుల భవిష్యత్తు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్ర ప్రజలకు శాభాకాంక్షలు తెలిపారు.‘‘రాష్ట్ర అవరతరణ సందర్భంగా అద్భుత రాష్ట్రమైన తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న పౌరులున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొనిపోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూడా అభినందనలు తెలియజేశారు. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణలోని నా సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఆమె ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అవతరణ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఆయన అనంతరం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.