close

తాజా వార్తలు

నన్ను ఓడించేందుకు రూ.150కోట్లు ఖర్చు: పవన్‌

గుంటూరు: ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని.. విజయం సాధించేవరకు పోరాడుతాననన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో విశాఖ జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో జనసేన జెండా ఎగురవేసేలా కృషిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రజాభిమానం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయాం. నా జీవితం రాజకీయాలకు అంకితం. నేను మళ్లీ చెబుతున్నా నా శవాన్ని నలుగురు మోసుకెళ్లే వరకు నేను జనసేనను మోస్తా.  ఓటమి నాకు కొత్త కాదు. దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని. 25 ఏళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఓటమి ఎదురైతే తట్టుగలనా? లేదా? అనేది నేను పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా. బలంగా గెలుస్తా. భీమవరంలో నన్ను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. పవన్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదు.. ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్థులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని నేను పట్టించుకోను. ప్రజా తీర్పుని గౌరవిద్దాం’’ అని నేతలతో అన్నారు. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని ఈ సందర్భంగా జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.