close

తాజా వార్తలు

తలాక్‌ బిల్లును వ్యతిరేకించిన జేడీయూ


పట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), భాజపా మధ్య బంధం  బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లుకు రాజ్యసభలో మద్దతు తెలపబోమని గురువారం జేడీయూ స్పష్టం చేయడమే అందుకు కారణం. ఆ పార్టీ సీనియర్‌ నేత, బిహార్ మంత్రి శ్యామ్ రజాక్ మాట్లాడుతూ..జేడీయూ ముమ్మారు తలాక్‌ నిషేధ బిల్లును వ్యతిరేకిస్తుందని, తాము ఆ మాట మీదే ఉంటామని తెలిపారు. ముమ్మారు తలాక్ అనేది ఒక సామాజిక అంశమని, దాన్ని సామాజిక స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. రాజ్యసభలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వెల్లడించారు. గతంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించారు. 

కొత్తగా కొలువుతీరిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవుల కేటాయింపు విషయంలో భాజపా, జేడీయూ మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. భాజపా ఆ పార్టీకి ఒక మంత్రి పదవిని కేటాయించినా.. మంత్రివర్గంలో చేరడానికి సుముఖుత చూపలేదు. అయితే ఎన్డీఏతోనే ఉంటామని మాత్రం నితీశ్‌ పార్టీ వెల్లడించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.