close

తాజా వార్తలు

భారత్‌ ఆ క్షిపణుల కొనుగోలుతో అమెరికాకు సమస్యే!

యూఎస్‌ కమాండర్‌ డేవిడ్‌సన్‌

వాష్టింగన్‌: రష్యా నుంచి భారత్‌ ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలను పొందితే అది అమెరికాకు సమస్యగా పరిణమిస్తుందని అగ్ర రాజ్యానికి చెందిన కమాండర్‌ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని సహా ప్రధాన నగరాల రక్షణలో భాగంగా ఐదంచెల రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, పృథ్వీ అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌  డిఫెన్స్‌ సిస్టమ్‌లు ఉంటాయి. రెండో దశలో ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ  ఉంటుంది. మూడో దశలో బరాక్‌-8 మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉంటాయి. నాలుగో దశలో ఆకాశ్‌ మిసైల్‌ సిస్టమ్‌, ఐదో దశలో(స్వల్పదూరం) అమెరికా నుంచి కొనుగోలు చేయనున్న ఎన్‌ఏఎస్‌ఏఎంఎస్‌-2 ఉంటాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్‌-400 మిసైల్‌ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు గతేడాది అక్టోబరులోనే రూ.40వేల కోట్లతో భారత్ ఒప్పందం చేసుకుంది. 

‘రష్యాకు చెందిన ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేయాలని చూస్తోంది. అది కొంతమేర సమస్యను సృష్టించింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అది వాళ్లు ఇష్టపడే కొనుగోలు చేస్తున్నారని నేను అనుకుంటున్నా’ అని కొలరాడోలో నిర్వహించిన యాస్పెన్‌ సెక్యురిటీ ఫోరంలో ఇండో పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్‌సన్‌ అన్నారు. భారత్‌-అమెరికా పౌర అణు ఒప్పందంలో విషయంలో కీలక పాత్ర పోషించిన నిక్‌ బర్న్స్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, అమెరికా అందించే రక్షణ వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రష్యా గగనతల వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేయడం లాభదాయకం కాదన్న తెలియజేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

‘భారత్‌ తటస్థ విధానం నిజంగా గర్వించదగినది. ఎస్‌-400 రక్షణ వ్యవస్థ కొనుగోలుపై నేను మాట్లాడిన దాన్ని ఒక విధానపరమైన విషయంగా భావిస్తుందనుకుంటున్నా. అంతేగానీ, సాంకేతిక సమస్యగా చూడవద్దు. భారత్‌తో మా ప్రయాణం అందరికంటే 10వేల అడుగుల ముందుగా ఉంది’ అని అన్నారు. ఇక అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసే రక్షణ సామాగ్రిలో సి-17 హెలికాప్టర్లు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు.  

రష్యా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తే, భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు గతంలో అమెరికా పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎస్-400 ట్రయంఫ్ లాంగ్ రేంజ్ మిసైల్. 400 కి.మీ. దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది అత్యంత శక్తిమంతమైన ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే మిసైల్స్‌లో ఒకటి. సుదూర లక్ష్యాలను చేధించగలిగే ఈ క్షిపణులు భారత రక్షణ వ్యవస్థలో చేరితే రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి  రక్షణపరంగా భారత్‌కు ఇది మరింత ఉపయోగంగా ఉంటుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.