close

తాజా వార్తలు

ద్యుతీ, హర్భజన్‌ నామినేషన్లు తిరస్కరణ!

భువనేశ్వర్‌: కీలక అవార్డుల కోసం భారత స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌, టీమిండియా ఆటగాడు హర్భజన్‌సింగ్‌ నామినేషన్లను క్రీడాశాఖ తిరస్కరించింనట్లు తెలుస్తోంది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్‌ నామినేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు గడువు తర్వాత దాఖలు చేయడంతో తిరస్కరించిందని సమాచారం. గడువులోపు దరఖాస్తు చేయకపోవడంతో పాటు సాధించిన పతకాలు ర్యాంకింగ్‌లో లేకపోవడంతో ద్యుతీ నామినేషన్‌ను వెనక్కిపంపారు. ‘నామినేషన్లను ర్యాంకింగ్‌ ఆర్డర్‌లో ఇవ్వమని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ)ను క్రీడాశాఖ కోరింది. ద్యుతీ ఐదో స్థానంలో ఉంది. దీని వల్ల ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.’ అని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒక అధికారి తెలిపారు. 

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిశానని, ఆయన తన నామినేషన్‌ను తిరిగి క్రీడాశాఖ పంపిస్తానని హామి ఇచ్చారని ద్యుతీచంద్‌ తెలిపింది. ‘ఇటలీలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. అర్జున అవార్డుకు నామినేషన్‌ను తిరిగి పంపిస్తానని, రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు. ఎందుకంటే ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, తుపాను కారణంగా గడువు తేదీలోపు నామినేషన్‌ చేయలేదు.’ అని ద్యుతీ పేర్కొంది. 2013 నుంచి నిలకడగా రాణిస్తున్నానని, జకర్తాలో రెండు పతకాలతో పాటు ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో స్వర్ణ పతకం సాధించానని తెలిపింది. భవిష్యత్తులో దేశం తరఫున మరిన్ని పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ఇటలీలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో ద్యుతీ 100 మీటర్ల రేసుని 11.32 సెకన్లలోనే పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.