
తాజా వార్తలు
దిల్లీ: పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆదివారం కీలక సమావేశం జరిగింది. జమ్ము కశ్మీర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (రెండో సవరణ) బిల్లు-2019ను రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్, రా అధిపతి సమంత్ గోయల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గౌబా తదితర అధికారులు సమావేశమయ్యారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్లో ఉగ్ర మూకలు హింస సృష్టించే అవకాశముందని పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు. కశ్మీర్లో పరిస్థితిపై పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల మధ్య వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. కేంద్రం మంత్రి వర్గం సోమవారం భేటీ కానుండగా, అంతకుముందు ఈరోజు సాయంత్రం భాజపా ప్రధాన కార్యదర్శులు సమావేశం కానున్నారు. ఈ పరిణామల మధ్య పాకిస్థాన్ అప్రమత్తమైంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదేశాల మేరకు ఆ దేశ భద్రతా కమిటీ ఈరోజు సమావేశం కానుంది.
కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశం కావాల్సి ఉన్నా, రెండు రోజుల ముందుగానే సోమవారమే సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూకశ్మీర్ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. అటు భాజపా ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు రాత్రి సమావేశం కానున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వెలువడుతున్న వేళ.. తాజా సమావేశాలు జరగడం చర్చనీయాంశమయ్యాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
