
తాజా వార్తలు
సైని భవిష్యత్ ఆశాకిరణం అంటున్న సెహ్వాగ్
ముంబయి: టీమిండియా వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీచేసేది యువ రిషభ్‌పంత్ అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. కీపింగ్ ప్రత్యామ్నాయాల్లో అతడే ముందున్నాడని వెల్లడించారు. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్ 9 టెస్టులు ఆడి 49.71 సగటుతో 696 పరుగులు చేశాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు బాదేశాడు.
ఓపెనింగ్ చేస్తాడు
‘రిషభ్ పంతే అత్యుత్తమ ప్రత్యామ్నాయం. టెస్టు క్రికెట్లో అతనిప్పటికే నిరూపించుకున్నాడు. వన్డే, టీ20ల్లో మళ్లీ నిరూపించుకోగలడు. ఎంఎస్ ధోనీ స్థానం భర్తీ చేసేందుకు అతడే ఉత్తమ ఆటగాడు. పంత్ కాస్త సమయం తీసుకుంటాడు. అతడి షాట్ల ఎంపికలో మార్పులు చేసుకొంటే టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందిస్తాడు. వచ్చే నాలుగైదేళ్లలో జట్టు కోసం అతడు ఓపెనింగ్ సైతం చేస్తాడని నా నమ్మకం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ చేయగల సామర్థ్యం అతడికి ఉంది’ అని సెహ్వాగ్ అన్నారు.
మహీనే సరైనోడు
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో మహీ నాలుగు లేదా ఐదో స్థానంలో వస్తే బాగుండేదని వీరూ అన్నాడు. ‘అప్పుడు నేను కామెంటరీ చేస్తున్నాను. ఎంఎస్ ధోనీ నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని అప్పుడు చెప్పింది నేనొక్కడినే. అలాంటి ఒత్తిడి సందర్భాలను ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న మెరుగైన ఆటగాడు ప్రస్తుత జట్టులో మరొకరు లేరు. అందుకే మహీ సరైన ఎంపిక అని భావించా’ అని వీరూ పేర్కొన్నారు.
ఎంతో ఎత్తుకు ఎదగాలి
యువ పేసర్ నవదీప్ సైనిపై ఈ ముల్తాన్ సుల్తాన్ ప్రశంసలు కురిపించారు. ‘యువ ఆటగాడు నవదీప్ సైని భవిష్యత్ ఆశాకిరణం. దిల్లీ రంజీ జట్టుకు నెట్‌బౌలర్‌గా ఉండేవాడు. ఆ తర్వాత రంజీలకు ఎంపికయ్యాడు. భారత్-ఏ తరఫున అదరగొట్టి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పేదరికం నుంచి వచ్చిన అతడిని చూసి సంతోషిస్తున్నా. టీమిండియా తరఫున అద్భుతంగా ఆడతాడని ఆశిస్తున్నా. సైని టీ20 అరంగేట్రం అదిరిపోయింది. త్వరలోనే అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నా’ అని వీరూ వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
