close

తాజా వార్తలు

కరెన్సీ నోట్ల గణేశుడు..నిమజ్జనం ఎలా మరి!

ముంబయి: మహారాష్ట్రలోని అకోలాలో కరెన్సీ నోట్లతో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. వీర్‌ భగత్‌సింగ్‌ గణేష్‌ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు టిల్లు తివారి మాట్లాడుతూ.. ‘గణనాధున్ని రూ.21లక్షల నోట్లతో తయారుచేశాం. ఇందుకోసం రూ.1, 100, 200, 500, 2000ల నోట్లను ఉపయోగించాం. ఈ ప్రతిమను తయారు చేసేందుకు మూడు రోజుల సమయం పట్టింది. ఇది నోట్లు, పిన్నుల సాయంతో తయారైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. కరెన్సీ నోట్లకు సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పది రోజులు పూజలు అందుకున్న ఈ వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. అదేంటి నోట్లను ఎలా నిమజ్జనం చేస్తారని ఆశ్చర్యపోతున్నారా..! ఈ విగ్రహానికి నిమజ్జనం అంటే నోట్లను విప్పదీయడమే’ అని తివారి వెల్లడించారు. గతంలోనూ ఇక్కడ 1100 కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేసినట్లు చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.