close

తాజా వార్తలు

‘సైరా’ ప్రీ-రిలీజ్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి.వినాయక్‌ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను చూసేందుకు మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 2 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.