close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. కారు-లారీ ఢీ..నలుగురి మృతి

కడప జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం వద్ద కడప-బెంగళూరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బెంగళూరు నుంచి కడపకు వెళ్తున్న కారు కేశాపురం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మహేశ్వరి

నవ్యాంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయన్ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు 22న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆయన అక్రమాస్తుల విలువ రూ. 60 కోట్లు!

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో కర్నూలు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) అక్కరాజు శివప్రసాద్‌ ఇళ్లపై అనిశా అధికారులు గురువారం దాడులు చేశారు. ఆయన నివాసాల్లో గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం  రూ.10 కోట్లు, బహిరంగ మార్కెట్‌లో రూ.60 కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలంగాణ పరిశ్రమ ప్రతిఫలిస్తోంది

ఐదున్నరేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ పాలసీ అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలో పరిశ్రమల అనుమతులు, వాటిలో ప్రభుత్వాల పాత్ర విషయంలో ఈ చట్టం విస్తృతమైన చర్చకు తెర లేపిందన్నారు. గురువారం దిల్లీలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం  నిర్వహించిన ఇండియా ఎకనామిక్‌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మృతుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం

గోదావరి నదిలో బోటు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గత నెలలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ నుంచి వెళ్లిన 17 మంది చిక్కుకున్నారు. మృతుల వివరాలు తెలిసిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని గురువారం నగరంలోని గవర్నర్‌ బంగ్లాలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాల్లో ఎవరికీ ఉద్యోగం లేకుంటే ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. శ్రీ మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం

దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి ఆరో రోజున మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. రెండు వైపులా గజరాజులు సేవలు చేస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చింది అమ్మావారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. శిరస్త్రాణాలు ధరించి గార్బా నృత్యం చేసిన పోలీసులు

8. బంగ్లా కోస్టుగార్డు అదుపులో ఏపీ మత్స్యకారులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు అదుపులోకి తీసుకుంది. విశాఖ పరిధి కొత్త జాలరిపేటలోని వాసుపల్లి రాములుకు చెందిన మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోటు ‘అమృత’ పది రోజుల క్రితం చేపల వేటకు విశాఖ నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లింది. నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు ఆ బోటు బంగ్లాదేశ్‌ సరిహద్దులోకి ప్రవేశించింది. దీంతో బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు బోటును, బోటులోని సిబ్బంది.. మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. స్కాన్‌ చెయ్‌.. సవివరంగా చదివెయ్‌

విద్యార్థులు పుస్తకాలు బాగా చదివేందుకు.. ప్రతిభావంతుల జ్ఞాన తృష్ణ మరింత తీర్చేందుకు పాఠ్య పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ క్యూఆర్‌ కోడ్‌ విధానంలో ముద్రించనుంది. పుస్తకాల్లో ఉన్న సమాచారంతో పాటు మరింత అదనంగా విషయాన్ని తెలుసుకునేవారికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విద్యా సంవత్సరమే ప్రయోగాత్మకంగా రెండు సబ్జెక్టులకు కొద్ది మొత్తంలో వర్తింపజేశారు. వచ్చే ఏడాది నుంచి 8, 9 తరగతుల్లో జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రాలు, గణితం పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. భారత కోర్టులో ఎన్‌బీఏ బంతి

బాస్కెట్‌బాల్‌ ప్రియులకు ఎన్‌బీఏ లీగ్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ, ఆదాయం కలిగిన.. సుదీర్ఘ చరిత్ర ఉన్న క్రీడా లీగ్‌ల్లో ఇదొకటి. ఇప్పుడీ లీగ్‌ ఇండియాలో అడుగు పెట్టింది. ముంబయి వేదికగా శుక్ర, శనివారాల్లో రెండు ఎన్‌బీఏ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.