close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కరవుభత్యం మంజూరుకు సీఎం సుముఖత

ప్రస్తుత హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక నియమావళి ముగిసిన వెంటనే తెలంగాణ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని. సమస్యలన్నింటినీ దశల వారిగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పెండింగులో ఉన్న కరవుభత్యాన్ని మంజూరు చేయడానికి ఆయన సుముఖత తెలిపినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. అ‘క్రమబద్ధీకరణ’ చెల్లదిక

ఏపీలో ముందుగా అనుమతి లేకుండా భవనాలు నిర్మించుకుని, లేదంటే నిబంధనలను ఉల్లంఘించి కట్టుకుని తర్వాత క్రమబద్ధీకరించుకుందాంలే అనుకుంటే ఇక కుదరదు. కొత్తగా అక్రమ భవనాల క్రమబద్ధీకరణ చేయకూడదని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. గతంలో వచ్చిన 27,403 దరఖాస్తులనే పరిశీలించి మార్చిలోగా పరిష్కరించనుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ ఉండకపోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మద్యంపై జే ట్యాక్స్‌

‘అమరావతిని దెబ్బ తీశారు. పోలవరాన్ని నిలిపేశారు. అమరావతిని బతికించుకుంటా. ఆ శక్తి నాలో ఉంది. ఏపీని మళ్లీ ప్రగతిపథంలో నడిపించే బాధ్యత తీసుకుంటా’ అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలపై జగన్‌ టాక్స్‌ (జే ట్యాక్స్‌) పడుతోంది. పరిమిత బ్రాండ్లను తీసుకొచ్చి జనం నుంచి అధిక మొత్తంలో జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఇదంతా జగన్‌కే వెళ్తోంది’ అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రెండ్రోజుల్లో టీఆర్‌టీ ఫలితాలు

రాష్ట్రంలో టీఆర్‌టీ, గ్రూప్‌-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత టీఆర్‌టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నేడు మహాబలిపురంలో మోదీ-జిన్‌పింగ్‌ల భేటీ

భారత్‌, చైనా సత్సంబంధాల బలోపేతానికి వేదికగా భావిస్తున్న అనధికార శిఖరాగ్ర చర్చలకు తరుణం సమీపించింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేడు చెన్నై చేరుకోనున్నారు. వారికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరు నేతలు ప్రయాణించనున్న మార్గాల్లో శుక్ర, శనివారాలు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. చర్చలకు వేదిక కానున్న మహాబలిపురం, పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రికి రూ. 5వేల కోట్ల ఆస్తులు

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర్‌, మాజీ మంత్రి ఆర్‌.ఎల్‌.జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. పరమేశ్వర్‌కు మైసూరు, మండ్య, తుమకూరులతోపాటు ఆస్ట్రేలియా, మలేషియాల్లోనూ సిద్ధార్థ అనుబంధ సంస్థలు ఉన్నట్లు తేలింది. మొత్తంగా తన వ్యాపారాలతో ఆయనకు సుమారు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సమర్థిస్తున్నారా..వ్యతిరేకిస్తున్నారా?

కాంగ్రెస్‌, ఎన్సీపీలపై కేంద్ర హోం మంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికరణం-370 రద్దు నిర్ణయాన్ని ఆ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయో, సమర్థిస్తున్నాయో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై అవి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 50 స్టేషన్లు.. 150 రైళ్ల ప్రైవేటీకరణ

దేశంలోని 50 రైల్వేస్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలకు తగ్గట్టు ఆధునికీకరించడం, అధునాతన సాంకేతికతతో 150 ప్రయాణికుల రైళ్లను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపడం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ అయిదుగురు సభ్యులతో కూడిన కార్యదర్శి స్థాయి సాధికార కమిటీని ఏర్పాటుచేసింది. అలాగే రైళ్లలో నేరాలపై దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకారానికి  www.railways.delhipolice.gov.in పేరుతో వెబ్‌సైట్‌, Sahyatri పేరుతో యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.76,000 కోట్ల మొండి బాకీల రద్దు!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) భారీ స్థాయిలో రుణాలను రద్దు చేసింది. మొత్తం రూ.76,600 కోట్ల విలువైన మొండి బకాయిలను ఖాతాల నుంచి తొలగించింది. రూ.100 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిన మొత్తం 220 మందికి చెందిన ఖాతాలివి. మార్చి 31, 2019 నాటికి రికవరీ కాని రుణాలు రూ.37,700 కోట్లుగా ఉన్నాయని ఎస్‌బీఐ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

10. ప్లాస్టిక్‌ను ‘భుజించే’ బ్యాక్టీరియా!

పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సురక్షితంగా వదిలించుకునేందుకు భారత పరిశోధకులు ఒక అద్భుత మార్గాన్ని కనుగొన్నారు. ఇలాంటి వ్యర్థాలను ‘భుజించే’ రెండు రకాల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను 2022 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో ఈ ఆవిష్కారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.