
తాజా వార్తలు
విశాఖపట్నం: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయికానీ, ఇంత శాడిస్టు ప్రభుత్వాన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్, బహిరంగసభలో తెదేపా తరఫున అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇస్తే.. 5 నెలల్లో ఐదు కోట్ల మంది నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారని విమర్శించారు. ఇసుక కొరత కారణంగా గత ఐదునెలలుగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధిలేక అల్లాడుతున్నారన్నారు. ఇప్పటికే 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించుకునేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల పక్షాన పోరాడుతున్నందునే జనసేనకు తెదేపా మద్దతిస్తోందని వెల్లడించారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ఐదు నెలల వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ఐదు నెలలుగా ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, లారీ ఇసుక ధర రూ.50వేలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ సభ నిర్వహించుకోకుండా పోలీసులు అడ్డుపడినా.. ఉప్పు సత్యాగ్రహానికి తరలివచ్చినట్లుగా లాంగ్ మార్చ్‌కు కార్మికులు తరలివచ్చారన్నారు. ఈ రాష్ట్రంలోని సమస్యలను అందరూ కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, ప్రశ్నించే నేతలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
