
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వెనక్కితగ్గడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించడం.. ఈ రోజు ఉదయం ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తాననడం ఆసక్తికరంగా మారాయి. ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే శివసేనకు మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని ఎన్సీపీ షరతు విధించడంతోనే ప్రభుత్వం నుంచి సేన వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
పార్టీల అత్యవసర సమావేశాలు..
మరోవైపు తాజా పరిణామాలపై చర్చించడానికి ఆయా పార్టీలు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలతో భేటీకి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈరోజు ఉదయం 10గంటలకు సమావేశమైంది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. మరోవైపు ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్సీపీతో కలిసే తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ నవాబ్ మాలిక్ పునరుద్ఘాటించారు. అలాగే ఎన్సీపీ ఎమ్మెల్యేలు సైతం శరద్ పవార్ అధ్యక్షతన ఉదయం 11గంటలకు భేటీ కానున్నారు. భాజపా, శివసేన కూడా వారి వారి ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవనున్నాయి. అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సంజయ్ రౌత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికలకు సిద్ధం కావాలి..
మరోవైపు కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏర్పడ్డ అస్థిరతకు తెరపడదని అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవ్వాలి అని వ్యాఖ్యానించారు. 2020లో తిరిగి ఎన్నికలు జరగొచ్చని జోస్యం చెప్పారు.
ఇలా ప్రభుత్వ ఏర్పాటకు భాజపా వెనక్కి తగ్గడంతో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల సమావేశాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సమీకరణాలు ఎలా మారనున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
