
తాజా వార్తలు
అవసరమైతే ఈ విధానాన్ని పొడగిస్తామంటున్న కేజ్రీవాల్
దిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ‘సరి-బేసి’ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అక్టోబరు నుంచి నవంబరు 14 వరకు కాలుష్య స్థాయిలపై పూర్తి నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)ని ఆదేశించింది. దీంతో పాటు గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య నమోదైన కాలుష్య స్థాయిల వివరాలు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.
మరికొద్ది రోజులు సరి-బేసి..
కాగా.. సరి-బేసి విధానం ఈ శుక్రవారం(నవంబరు 15)తో ముగియనుంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే ఈ విధానాన్ని మరికొద్ది రోజులు పొడగిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా వెల్లడించారు.
పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనంతో దిల్లీ కాలుష్య ఛాంబర్లా మారిన విషయం తెలిసిందే. దట్టమైన కాలుష్య పొగలు అలుముకోవడంతో అక్కడి ప్రజలకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నెల 4 నుంచి 15 వరకు సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చారు. అయితే గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా నవంబరు 11, 12 రోజుల్లో మినహాయింపు కల్పించారు. కాగా.. ఈ రెండు రోజుల్లో సరి-బేసి విధానం లేకపోవడంతో బుధవారం దిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ ప్రమాదకర స్థితికి చేరాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
