Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 102437
      [news_title_telugu_html] => 

ఎగిరే టాక్సీ.. అదిరే వెన్యూ!

[news_title_telugu] => ఎగిరే టాక్సీ.. అదిరే వెన్యూ! [news_title_english] => [news_short_description] => సెగ్మెంట్‌ పరంగా ఇది చిన్న కారైనా ఫీచర్లు ఎక్కువ. ప్రమాదం, అత్యవసరాల్లో ఎస్‌వోఎస్‌ ఎమర్జెన్సీ నెంబర్లకు ఆటోమేటిగ్గా అలర్ట్‌లు పంపించే వెసులుబాటు ఉంది. సబ్‌ కాంపాక్ట్‌ విభాగంలో ఈ ఫీచర్‌ అందించిన తొలి కారు ఇదే. భారతీయ యాసతో కూడిన ఇంగ్లిష్‌ వాయిస్‌ అసిస్ట్‌ సిస్టమ్‌, స్ల్పిట్‌ హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌, రిమోట్‌తో.. [news_tags_keywords] => Flying taxi, Venue, Design, Special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 01:41:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎగిరే టాక్సీ.. అదిరే వెన్యూ! - EENADU
close

తాజా వార్తలు

ఎగిరే టాక్సీ.. అదిరే వెన్యూ!

*ఆకాశంలో చక్కర్లు కొట్టే ఫ్లైయింగ్‌ టాక్సీ అందుబాటులోకి రాబోతోంది... దీంతో తొలి ఆకాశయాన క్యాబ్‌ సర్వీసులకు తెర లేవబోతోంది... ఆ ఎగిరే వాహనం పేరు లిలియం...
* భారతీయ రోడ్లపైకి మరో కొత్త ఎస్‌యూవీ దూసుకొచ్చింది... అదే హ్యుందాయ్‌ వెన్యూ... దీని రాకతో నాలుగు మీటర్లలోపు సెగ్మెంట్‌లో ఆసక్తికర పోరు మొదలైంది... దేని ప్రత్యేకత దానిదే.  పూర్తి వివరాలతో విహరిద్దాం పదండి.

మేటి హంగుల ఎస్‌యూవీ
ఇప్పుడంతా స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల శకం నడుస్తోంది. ముఖ్యంగా నాలుగు మీటర్ల లోపు విభాగంలో అమ్మకాలు జోరు మీదున్నాయి. ఆ సెగ్మెంట్‌లో పోటీ పడటానికొచ్చేసింది హ్యుందాయ్‌ వెన్యూ. గత నెలలో న్యూయార్క్‌ ఆటో షోలో మొదటిసారి దర్శనమిచ్చిన  ఈ అర్బన్‌ ఎస్‌యూవీని శాంటా ఫే స్ఫూర్తితో భారతీయుల అవసరాలకు అనుగుణంగా మలిచారు.  కే1 అడ్వాన్స్డ్‌ వెర్షన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద వస్తోంది. ఈ, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌(ఓ), ఎస్‌ఎక్స్‌ ప్లస్‌ అని ఐదు రకాల్లో లభిస్తోంది.
డిజైన్‌ కొత్తగా
హ్యుందాయ్‌ మోడళ్లన్నీ డబ్బా ఆకారంలో బాక్సీలా ఉంటాయంటారు. ఈసారి దానికి భిన్నంగా మెలికలు తిరిగిన కర్వీ ఆకారంతో రూపొందించారు. ఎప్పట్లాగే హ్యుందాయ్‌ బ్రాండ్‌కి ప్రత్యేకమైన క్యాస్కేడింగ్‌ గ్రిల్‌ దీనికీ అమర్చారు. పైగా క్రోమ్‌ మెరుపులద్దారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, ప్రొజెక్టర్‌ ఫాగ్‌ల్యాంప్‌లు సరికొత్తగా ఉన్నాయి. పదహారు అంగుళాల అలాయ్‌ చక్రాలు, రూఫ్‌ రెయిల్స్‌, జడ్‌ క్లస్టర్‌ ప్యాటర్న్‌ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు.. డిజైన్‌కి మరింత కొత్త కళను తీసుకొచ్చాయి. మూడు డ్యుయెల్‌ టోన్లతో మొత్తం ఏడు రంగుల్లో లభిస్తోంది.
ఇంటీరియర్‌ అందంగా
నలుపు, తెలుపు రంగుల డ్యుయెల్‌ టోన్‌ ఇంటీరియర్‌ చూడముచ్చటగా ఉంది. సమతలమైన డ్యాష్‌బోర్డ్‌, నునుపైన సెంట్రల్‌ కన్‌సోల్‌ డిజైన్‌.. దానిపై చూడ్డానికి ట్యాబ్లెట్‌లా ఉన్న 8.4అంగుళాల తాకేతెర ప్రత్యేకం. ఎయిర్‌ వెంట్ల చుట్టూ వెండిరంగు బోర్డర్లు ఇవ్వడంతో లోపల మరింత ఆకర్షణీయంగా కనపడుతోంది. మెలికలు తిరిగిన నలుపు రంగు లెదర్‌ సీట్లు వాటిపై తెలుపురంగు కుట్లు.. ఎస్‌యూవీ లుక్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. పెద్ద రూఫ్‌ రెయిల్స్‌, రేయర్‌ ఏసీ వెంట్లు, కారు అడుగు భాగం  మన్నికగా ఉండటానికి అండర్‌బాడీ క్లాడింగ్‌.. ఇతర ఫీచర్లు. ఐదుసీట్ల ఈ కారులో పోటీదారులతో పోలిస్తే బూట్‌ స్పేప్‌ ఎక్కువగా ఉంది.

ప్రత్యేకతలు అదనంగా
సెగ్మెంట్‌ పరంగా ఇది చిన్న కారైనా ఫీచర్లు ఎక్కువ. ప్రమాదం, అత్యవసరాల్లో ఎస్‌వోఎస్‌ ఎమర్జెన్సీ నెంబర్లకు ఆటోమేటిగ్గా అలర్ట్‌లు పంపించే వెసులుబాటు ఉంది. సబ్‌ కాంపాక్ట్‌ విభాగంలో ఈ ఫీచర్‌ అందించిన తొలి కారు ఇదే. భారతీయ యాసతో కూడిన ఇంగ్లిష్‌ వాయిస్‌ అసిస్ట్‌ సిస్టమ్‌, స్ల్పిట్‌ హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌, రిమోట్‌తో ఇంజిన్‌ ఆన్‌/ఆఫ్‌ చేసే సదుపాయం, లొకేషన్‌ ట్రాకింగ్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్‌గా ఈ-సిమ్‌కార్డు ఇచ్చారు. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. మామూలు ఫోన్ల మాదిరిగా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇతర ప్రత్యేకతల విషయానికొస్తే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్‌, ఎకో కోటింగ్‌, అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆర్కామిస్‌ సౌండ్‌ సిస్టమ్‌లు చెప్పుకోవచ్చు. జియో ఫెన్సింగ్‌, లైవ్‌ నావిగేషన్‌, వాయిస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా ఆజ్ఞలివ్వొచ్చు. ‘హ్యుందాయ్‌ బ్లూ లింక్‌’ యాప్‌ ద్వారా కారుని రిమోట్‌తో స్టార్ట్‌/స్టాప్‌ చేయొచ్చు. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఈబీడీ, బేసిక్‌ మోడల్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, హైఎండ్‌ వేరియంట్‌లో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఇతర భద్రతా ఫీచర్లు.

విమాన కార్లు వచ్చేస్తున్నాయ్‌
లా, ఉబర్‌ క్యాబ్‌లు తెలియనిదెవరికి? స్మార్ట్‌ఫోన్‌లో బుక్‌ చేస్తే ఐదు నిమిషాల్లో మన ముందుంటాయి. చెప్పిన గమ్యానికి సేఫ్‌గా చేరుస్తాయి. అచ్చం ఇలాగే ఎగిరే టాక్సీలు మొదలు కాబోతున్నాయి. దీంతో గంటల ప్రయాణం నిమిషాల్లోకి మారబోతోంది. కాకపోతే కాసులు కాస్త ఎక్కువ చెల్లించాలి. జర్మనీకి చెందిన ‘లిలియం’ అనే అంకుర సంస్థ ఈ ఎగిరే క్యాబ్‌ల సర్వీసుల్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే అమెరికా, యూరోప్‌ల్లో కొన్ని నగరాల్లో అనుమతి పొందే దశలో ఉంది. తర్వాతి అడుగు చైనా, భారత్‌ల్లోనే అంటోంది. ఫటాఫట్‌ ఆ విషయాలు చెప్పేసుకుందాం.

* పైలట్‌తోపాటు మరో నలుగురు ప్రయాణించడానికి వీలుగా ఉంటుందీ బుల్లి విమానం కమ్‌ ఎగిరే కారు. 
* ఉబర్‌, ఓలాల్లో కార్లని  బుక్‌ చేసుకున్నట్టుగానే ఈ ఫ్లైయింగ్‌ టాక్సీలను ఇంట్లోంచే బుక్‌ చేసుకుని గాల్లోకి ఎగిరిపోవచ్చు. 
* వీటికి రన్‌వేలు అక్కర్లేదు. శక్తిమంతమైన 36 ఎలక్ట్రిక్‌ జెట్‌ ఇంజిన్లు ఉండటంతో చిన్న స్థలంలో కూడా నిలువుగా దిగిపోతుంది.
* జెట్స్‌, హెలిక్యాప్టర్ల మాదిరిగా  ఇవి పెద్దగా చప్పుడు చేయవు. 
* విమానంలా పెద్దతోక, ప్రొపెల్లర్స్‌, గేర్‌బాక్సులు ఉండవు. 
* ఇందులో కూర్చొని నగరమంతా చుట్టేయాలంటే 70 డాలర్లు చెల్లించాలి. మన రూపాయల్లో దాదాపు ఐదువేలు.
* రెండేళ్ల నుంచి వందలసార్లు  టెస్ట్‌ రన్‌ చేశారు. తాజాగా మానవరహితంగానూ పరీక్షించారు.
* ఇది విద్యుత్తు బ్యాటరీలతో పని చేస్తుంది. 
* దీని సర్వీసుల వినియోగంపై ఇప్పటికే లండన్‌లోని కొందరు వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలతో చర్చలు నడుస్తున్నాయి.

ధర: రూ.6.5లక్షల నుంచి రూ.11.10లక్షలు (ఎక్స్‌షోరూం) 
ఇంజిన్‌ మేటిగా : రెండు పెట్రోల్‌, ఒక డీజిల్‌ వేరియంట్లలో లభిస్తోంది.
పెట్రోల్‌: 1.0/1.2 లీటర్ల టర్బో ఇంజిన్‌, 82/118బీహెచ్‌పీ సామర్థ్యం, 114ఎన్‌ఎం/172ఎన్‌ఎం, 5 స్పీడ్‌ ఎంటీ/6 స్పీడ్‌ ఎంటీ/ 7స్పీడ్‌ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌
డీజిల్‌: 1.4లీటర్ల ఇంజిన్‌, 89బీహెచ్‌పీ, 220 ఎన్‌ఎం, 6స్పీడ్‌ ఎంటీ
మైలేజీ: 23.70కిమీ/లీటరు
పోటీదారులు: మారుతిసుజుకీ విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌, టాటా నెక్సాన్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.