close

తాజా వార్తలు

మహేశ్‌, సితార, గౌతమ్‌.. ఈ ఫొటో చూశారా!

లంచ్‌ బ్రేక్‌ ఫ్యామిలీ కోసం..

హైదరాబాద్‌: సినిమాలతో పాటు, కుటుంబానికి తగిన సమయం కేటాయించే నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. పిల్లలతో కలిసి తరచూ విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా ఆయన సతీమణి నమ్రత సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో సితారపై మహేశ్‌, మహేశ్‌పై గౌతమ్ పడి ముగ్గురూ కలిసి అల్లరి చేస్తున్న కనిపించారు . ‘ఒకరిపై మరొకరు పడ్డారు.. లంచ్‌ బ్రేక్‌ను మహేశ్‌ ఇంట్లో గడిపారు’ అని ఈ ఫొటోకు నమ్రత‌ క్యాప్షన్‌ ఇచ్చారు. క్యూట్‌గా ఉన్న ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.‌

మహేశ్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించనున్న సినిమాలో మహేశ్‌ నటించనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.