close

తాజా వార్తలు

‘మహానాయకుడు’పై సినీ ప్రముఖుల స్పందన

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యన్‌టిఆర్’ టైటిల్‌తో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగమైన ‘కథానాయకుడు’ జనవరిలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ రోజు విడుదలైన ‘మహానాయకుడు’ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలిబుచ్చారు.

‘ఎన్టీఆర్‌ జీవితమే ఓ నిదర్శనం. ఆ జీవితాన్ని బాలయ్య అద్భుతంగా తెరపై చూపించారు. సినిమా గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్‌ టచింగ్‌’- పరుచూరి గోపాలకృష్ణ

‘ఓ తండ్రి కథను అందరికీ చెప్పడంతో బాలయ్య జన్మధన్యమైంది. బాలయ్య నటించిన చిత్రాల్లో ఇదే ది బెస్ట్ ఫిలిం’- బీవీఎస్‌ రవి

‘ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా చూసి మీరు కూడా తప్పకుండా సర్‌ప్రైజ్‌ అవుతారు. అందరూ చాలా బాగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు’- దగ్గుబాటి సురేశ్‌బాబు

‘సినిమాలో బాలకృష్ణ పలికించిన డైలాగులకు ప్రతిఒక్కరూ చప్పట్లు కొడతారు. అద్భుతమైన చిత్రం. చాలా భావోద్వేగానికి గురయ్యా’- వి.వి వినాయక్‌

‘ఈ సినిమాలో మళ్లీ రామారావుగారిని చూసిన ఫీలింగ్‌ కలిగింది. క్లైమాక్స్‌ చూశాక ఒళ్లు గగుర్పొడిచింది’- తమ్మారెడ్డి భరద్వాజ్‌

‘ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టేశారు. ఆయన నటన చూసి షాకయ్యాను’- ఛార్మి

‘బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ చెప్పిన డైలాగ్‌ విని ఏడ్చేశాను. నాన్నంటే ఎంత అభిమానమో ఈ సినిమాతో మరోసారి రుజువైంది’- పూరీ జగన్నాథ్‌

‘మళ్లీ బాలయ్య అదరగొట్టేశారు. ఈ సినిమాలో నటించిన వారందరూ ఎంతో గర్వపడతారు. చిత్ర బృందానికి కంగ్రాట్స్‌’- సుధీర్‌బాబు

‘రానా దగ్గుబాటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్యకు వందకు 110 మార్కులు వేస్తాను. ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడానికి విద్యాబాలన్‌ మరో కారణం’- నాగ్‌ అశ్విన్‌ (మహానటి దర్శకుడు)

‘తెలుగోడి ఆత్మ గౌరవం. ఆ మహానుభావుడికి ఈ గౌరవం దక్కాల్సిందే. ఈ అద్భుతమైన సినిమాను తీయడం క్రిష్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. మీరూ ఈ అద్భుత చిత్రాన్ని చూడండి’- స్మిత (గాయని)

‘మహానాయకుడు సినిమా చూశాను. నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్‌లోని కోపాన్ని, ఆయన పడిన బాధను కళ్లకు కట్టినట్లు చూపించారు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’- అనిల్‌ రావిపూడి (దర్శకుడు)

‘భావోద్వేగాలతో నిండిన పవర్‌ఫుల్‌ చిత్రం ‘మహానాయకుడు’. తెలుగువారి గర్వకారణమైన తాతగారి పాత్రలో గొప్పగా నటించినందుకు నాన్నకు శుభాకాంక్షలు. సినిమాలోని అందరి ప్రదర్శనలు చూసి చాలా ఎంజాయ్‌ చేశాను’- బ్రాహ్మణి


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.