close

తాజా వార్తలు

ఇష్టమైన సఖుడా.. ఒక్కసారి చూడరా పిల్లడా..

‘మజిలీ’ కొత్త పాట విన్నారా

హైదరాబాద్‌: ‘ఇష్టమైన సఖుడా.. ఒక్కసారి చూడరా పిల్లడా..’ అంటూ నాగ చైతన్యతో తన ప్రేమను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు కథానాయిక సమంత. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ఇటీవల ఈ సినిమాలోని ‘వన్‌ బాయ్‌ వన్‌ గర్ల్‌ లుకింగు, హైటు‌ వైటు చెకింగు..’ అంటూ విడుదలైన పాటకు మంచి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. దీన్ని చై, సామ్‌లపై చిత్రీకరించారు. ‘ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా.. నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ.. నీ వెంట ఉంటా కడదాకా..’ అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. పాట లింక్‌ను సమంత ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘చిన్మయి నీ స్వరంలో మ్యాజిక్‌ ఉంది’ అని మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ మరో కథానాయిక. శివ నిర్వాణ దర్శకుడు. షైన్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, రాజశ్రీ నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత చై, సామ్‌ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా హక్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.