
తాజా వార్తలు
టైగర్, దిశాల గురించి జాకీ ష్రాఫ్
ముంబయి: బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరు విహారయాత్రలకు, పార్టీలకు జంటగా వెళ్లి వస్తున్నారు. అయితే తమ మధ్య బంధం గురించి టైగర్, దిశా నోరువిప్పలేదు. ‘మేం మంచి స్నేహితులం’ అని మాత్రమే చెప్పుకొచ్చారు. తాజాగా తన కుమారుడి ప్రేమ విషయంపై నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. ‘టైగర్‌కు 25 ఏళ్ల అమ్మాయి స్నేహితురాలిగా దొరికింది. ఆ తర్వాత అతడు మరొకరి కోసం చూడలేదు. వారిద్దరి అభిప్రాయాలు, ఇష్టాలు, వృత్తి ఒకటే. కలిసే డ్యాన్స్ వర్క్ అవుట్లు చేస్తుంటారు. ఆమె (దిశా) ఆర్మీ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారు. అందుకే క్రమశిక్షణ విలువ ఆమెకు బాగా తెలుసు (పబ్లిక్‌లో వ్యక్తిగత జీవితం గురించి చెప్పకపోవడాన్ని ఉద్దేశిస్తూ). ఎవరికి తెలుసు వాళ్లిద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారేమో. లేకపోతే స్నేహితుల్లానే మిగిలిపోతారేమో’ అని చెప్పారు.
ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో టైగర్‌ను దిశా గురించి కరణ్ ప్రశ్నించారు. ‘నేను ఆమెకు గొప్ప స్నేహితుడ్ని. ఆమెతో ఉండటం నాకు ఇష్టం. అలానే ఉన్నా. మా ఇద్దరి ఇష్టాలు దాదాపు ఒకటే. నాకు చిత్ర పరిశ్రమలో పెద్దగా స్నేహితులు లేరు. నేను సౌకర్యంగా ఉండే వారిలో దిశా ఒక్కరు’ అని అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
