close

తాజా వార్తలు

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లేటస్ట్‌ అప్‌డేట్‌..!

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందిస్తున్నారట. ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలోని పాటలకు సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌ రాయడం మొదలుపెట్టారు. ఆయన అద్భుతంగా, వేగంగా పని పూర్తిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద ఉన్న అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగున్నట్లు కీరవాణి గతంలో వెల్లడించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం జక్కన్న ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.