close

తాజా వార్తలు

రామ్‌ ‘2.ఓ’ లోడింగ్‌..


హైదరాబాద్‌: యువ కథానాయకుడు రామ్‌ తన తర్వాతి సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం చాలా శ్రమిస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను రామ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రామ్‌ 2.ఓ లోడింగ్‌..’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోల్లో రామ్‌ చాలా ఫిట్‌గా కనిపించారు. అంతేకాదు సిక్స్‌ప్యాక్‌లో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. గెడ్డం పెంచారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. రామ్‌ కష్టపడే తత్వాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూరీతో కలసి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. పునీత్‌ ఇస్సార్‌, సత్యదేవ్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రాజ్‌ తోట ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పూరీ-రామ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.