
తాజా వార్తలు
నేను, అత్త ఒకే డ్రెస్‌లో..
హైదరాబాద్: ‘అబ్బాయిలు తమ అమ్మలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటుంటారు’.. ఈ మాటను మనం ఇప్పటికే చాలా సార్లు వినుంటాం. అయితే ఇది తన విషయంలో నిజమైనట్లు ఉందని కథానాయిక సమంత అంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. అందులో సామ్, ఆమె అత్తయ్య లక్ష్మి.. వీరిద్దరి మధ్యలో నాగచైతన్య కూర్చుని ఉన్నారు. వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం కోసం జయపుర వెళ్లినప్పుడు ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. కాగా సామ్, లక్ష్మి ఒకే డిజైన్, కలర్ దుస్తులు ధరించడం విశేషం. దీన్ని ఉద్దేశిస్తూ సమంత పోస్ట్ చేశారు. ‘మా అత్తయ్యతో సంతోషంగా గడిపా. ఇద్దరం ఒకేరోజు ఒకేరకమైన దుస్తులతో బయటికి వచ్చాం (ఇది ముందుగా ప్లాన్ చేసుకుంది కాదు). దీన్ని మీరు నమ్మాలి. అబ్బాయిలు తమ అమ్మలాంటి అమ్మాయి కావాలి అనుకుంటారు.. అనుకోకుండా అది మా విషయంలో నిజమైంది’ అంటూ సామ్.. చైతన్యను ట్యాగ్ చేశారు.
సామ్ నటించిన ‘మజిలీ’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య కథానాయకుడి పాత్ర పోషించారు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. తమిళ సినిమా ‘96’ తెలుగు రీమేక్‌లో సామ్ నటించబోతున్నారు. శర్వానంద్ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘ఓ బేబీ’ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
