close

తాజా వార్తలు

‘జైసింహా’ కలయికలో

నందమూరి బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం 2018 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. బాలయ్య - కె.ఎస్‌ రవికుమార్‌ మరోసారి కలసి పనిచేయబోతున్నారు. వచ్చే నెలలో లాంఛనంగా  చిత్రీకరణ మొదలెట్టే అవకాశముంది. నిజానికి ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ తరవాత బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓ సినిమా చేయాలి. అది కాస్త ఆలస్యం అవుతుండడంతో.. ఈలోగా కె.ఎస్‌.రవికుమార్‌ సినిమాని పట్టాలెక్కించాలని బాలయ్య భావిస్తున్నారట. ఆగస్టులో బోయపాటి సినిమా మొదలవుతుంది. ఈలోగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలన్నది బాలయ్య ఆలోచన. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.