close

తాజా వార్తలు

మరోసారి  ఢీ కొడుతున్నారు

‘లెజెండ్‌’లో నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు జగపతిబాబు. ఆ సినిమా, అందులో పోషించిన పాత్ర.. జగపతిబాబు కెరీర్‌ని మలుపు తిప్పాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి నటించడానికి సిద్ధమయ్యారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఇందులో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించనున్నారు. ఈనెల 17న లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభిస్తారు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ‘జై సింహా’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు సంగీతం అందించిన చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.