
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సమయంలో ఒక్కో ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ హవా నడుస్తోంది. ఇటీవల బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్ దీన్ని పూర్తి చేసి, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులంతా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే, ఇప్పుడు మన మధ్యన లేని హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రూస్లీ ఇప్పుడు కాదు.. ఎప్పుడో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. అదీ కాలితోనో.. లేదా చేతితోనో కాదండోయ్ ఏకంగా నాన్‌చాక్‌తో! దాన్ని తిప్పుతూ మూడు బాటిళ్ల మూతలను తీసేశాడు.
మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది మొదట బ్రూస్లీనే. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ సొంతంగా స్టంట్స్ చేసేవారు. ఇక నాన్చాక్ తిప్పితే ఆ వేగం కెమెరాకు కూడా అందేదికాదు. అలాంటి బ్రూస్లీ గాజు సీసాలపై ఉన్న మూతలను నాన్చాక్ ఉపయోగించి ఎప్పుడో తీసేశారు. ఈ వీడియోను ఆయన కుమార్తె ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
#BottleCapChallege 🐉🔥🔥🔥 @daetrix_art, we 👀 you 💯 🐉👊🏽💥
— Bruce Lee (@brucelee) July 6, 2019
.
VFX & Music by
@daetrix_art🎨 @daetrix_music🎧 pic.twitter.com/kMOEicPOPu
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
