close

తాజా వార్తలు

స్టార్‌.. స్టార్‌.. మెగాస్టార్‌

చిరంజీవికి ఈరోజు చాలా స్పెషల్‌ ఎందుకంటే..

హైదరాబాద్‌: నటనలో ఎందరో నూతన నటులకు స్ఫూర్తి ఆయన. డ్యాన్స్‌లో మరెందరో కళాకారులకు దైవం ఆయన. తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే..! ఆయన మరెవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి వరకూ ఆయన జీవితం ఎందరికో పాఠం. నిజజీవితంలోనే కాదు సినీ చరిత్రలో కూడా తనకంటూ ఓ కొత్త అధ్యయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వేసిన బాటలోనే మరెందరో నటులు ఆయన ఇంటి నుంచి ఈ పరిశ్రమలోకి వచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఆయన సినీ పరిశ్రమకు వచ్చి నేటితో 41 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా మెగా అభిమానులు మెగాస్టార్‌ చిత్రాలకు సంబంధించిన ఎన్నో ఫొటోలను షేర్‌ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

‘ప్రాణం ఖరీదు’ టు ‘సైరా’:

చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది ‘పునాదిరాళ్లు’ చిత్రంతోనే అయినా.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతోనే. ఈ సినిమా సెప్టెంబర్‌ 22, 1978లో విడుదలైంది. ఆ సినిమాలోని ఆయన సరసన జయసుధ నటించారు. ఆ తర్వాత ఆయన ఎందరో దర్శకులతో పనిచేశారు. ఎన్నో హిట్‌ చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన నటించిన 100వ చిత్రం ‘త్రినేత్రుడు’. ఈ సినిమా సెప్టెంబర్‌ 22, 1988లో విడులయ్యంది. ఈ చిత్రంలో భానుప్రియ చిరంజీవికి జంటగా కనిపించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సరిగ్గా మళ్లీ అదే రోజు అంటే సెప్టెంబర్‌ 22, 2019 ఈ రోజు చిరంజీవి నటించిన 151 చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి ప్రిరిలీజ్‌ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.

‘పున్నమినాగు’, ‘ఖైదీ’, ‘ఛాలెంజ్‌’, ‘పసివాడిప్రాణం’, ‘రుద్రవీణ’, ‘యముడికి మొగుడు’, ‘స్వయంకృషి’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠామేస్ర్తీ’, ‘హిట్లర్‌’, ‘ఇంధ్ర’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘ఖైదీ నంబర్‌.150’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.