close

తాజా వార్తలు

మొదలైన విజయ్‌ 64వ చిత్రం

పూజా కార్యక్రమంలో చిత్ర బృందం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న 64వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. అట్లి దర్శకత్వంలోని ‘బిగిల్‌’ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు విజయ్‌. కొన్ని రోజుల స్వల్ప విశ్రాంతి తీసుకున్న ఆయన మళ్లీ చెన్నై వచ్చి గురువారం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెందూరపాండి, దేవా, రసిగన్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన గ్జేవియర్‌ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానగరం, ఖైది చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాతో ఆకట్టుకోనున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. విజయ్‌ చిత్రానికి రెండోసారి ఆయన సంగీతం అందిస్తున్నారు. సత్యన్‌, సూర్యన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌సేతుపతి, మలయాళ నటుడు ఆంటని, శాంతనులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌కి జోడీగా మాళవిక మోహన్‌ను ఎంచుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందులో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర తారలు, సాంకేతిక కళాకారులు విజయ్‌తో ఫొటోలు దిగారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.