close

తాజా వార్తలు

పెట్రోమాక్స్‌ భిన్నమైన హర్రర్‌ చిత్రం: తమన్నా

తమన్నా

కోడంబాక్కం, న్యూస్‌టుడే: తెలుగులో విజయం సాధించిన ‘ఆనందో బ్రహ్మ’ తమిళంలో ‘పెట్రోమాక్స్‌’గా తెరకెక్కుతోంది. రోహిన్‌ వెంకటేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. ప్రేమ్‌, మునీష్‌కాంత్‌, సత్యన్‌, కాళివెంకట్‌, మైమ్‌ గోపీలు ఇతర తారాగణం. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విలేకరుల సమావేశం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. నా చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని చూసినప్పుడు ఇది తప్పకుండా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మాను. ఆ నమ్మకంతోనే తమిళంలో నటించా. సినిమా చాలా బాగొచ్చింది. బృందం మొత్తం ఈ సినిమాకు కోసం బాగా శ్రమించింది. ఇందులో నటించిన సత్యన్‌, మునీష్‌కాంత్‌ మాదిరిగా నేను కూడా ఓ పాత్ర పోషించానంతే. బాహుబలి, సైరా వంటి చిత్రాల లాగా నాకు ఇచ్చిన పాత్రను పోషించా. దర్శకుడు రోహిన్‌ ఈ సినిమాను చాలా వేగంగా చిత్రీకరించారు. సినిమా మొత్తాన్ని 32 రోజుల్లో పూర్తిచేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక జిబ్రాన్‌ సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తమిళంలో హర్రర్‌ కామెడీ చిత్రాలు చాలా వచ్చాయి. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని’ చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.