
తాజా వార్తలు
హైదరాబాద్: అమెరికన్ గాయని కెటీపెర్రీ మొట్టమొదటిసారి ముంబయిలో లైవ్ కన్సెర్ట్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆమె ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. నవంబర్ 16వ తేదీన ఆమె ప్రోగ్రామ్ జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమె కోసం ఓ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ పార్టీకి అభిషేక్-ఐష్, ఆలియా భట్, షాహిద్ కపూర్ దంపతులు, అనుష్క శర్మ, అర్జున్ కపూర్, మలైకా అరోరా, అనన్య పాండే, కాజోల్, కరిష్మా కపూర్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఈ పార్టీ హాజరైన కెటీపెర్రీ బాలీవుడ్, టాలీవుడ్ తారలతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రెండు రోజుల క్రితమే కెటీపెర్రీ భారత్కు చేరుకున్నారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్.. కెటీకి ముంబయిలోని పలు ప్రదేశాలను చూపిస్తున్నారు. తాజాగా జాక్వెలిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెటీపెర్రీకి బాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. తను ఇప్పటికే కొన్ని చిత్రాలను కూడా చూసింది. చూడడానికి ఏదైనా సినిమా చెప్పమని నన్ను అడగగా.. నేను ‘కిక్’ చూడమని చెప్పాను. మన సంప్రదాయాలు గురించి తెలుసుకునేందుకు తను ఎంతగానో ఇష్టపడుతుంది’ అని అన్నారు. అలాగే కెటీపెర్రీ సైతం తనకు ముంబయి అంటే చాలా ఇష్టమని, ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
