close

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి..

మరో 10 మందికి గాయాలు

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. ‘అంక్లావ్‌ ప్రాంతంలోని గంభీరా గ్రామం మీదుగా ఉన్న రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. మృతుల్లో చాలా మంది ఓ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులేనని తెలిపారు.

కార్మికులు తమ పనులు ముగించుకుని వడోదర జిల్లా పాద్ర నుంచి బోర్సాద్‌లోని సరోల్‌ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ‘తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. మరొకరు వడోదరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. ఆ వ్యానులో మొత్తం 22 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి వడోదర, బోర్సాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.  
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.