
తాజా వార్తలు
అలప్పుజా: కేరళలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ని మరో పోలీసు అధికారి పెట్రోలు పోసి సజీవదహనం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సౌమ్య పుష్కరన్ (31) మావేలిక్కర మున్సిపాలిటీ పరిధిలోని వాలిక్కున్న పోలీస్స్టేషన్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ (సీపీఓ)గా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఆమె ఇంటి సమీపంలోనే ఆలువా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అధికారిగా పని చేస్తున్న అజాస్ కారుతో ఎదురుగా వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. వెంటనే కారు దిగి ఆమెను పట్టుకోబోయేందుకు ప్రయత్నించాడు. తప్పించుకొని పారిపోతుండగా..వెంబడించి.. గొడ్డలితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
సౌమ్య బాధతో అర్తనాదాలు చేస్తుండగా.. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనలో అజాస్కు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆయన శరీరం కూడా దాదాపు 50 శాతం వరకు కాలిపోయింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
