Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114611
            [news_title_telugu_html] => 

అరకోటి పనికి రూ.2 లక్షలు ఇవ్వలేవా?

[news_title_telugu] => అరకోటి పనికి రూ.2 లక్షలు ఇవ్వలేవా? [news_title_english] => He was found asking for a bribe [news_short_description] => దివ్యాంగ సంక్షేమ శాఖ ద్వారా నడిచే వృద్ధుల డేకేర్‌ కేంద్రాల అనుమతుల కోసం లంచం అడుగుతూ ప్రకాశం జిల్లా దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు అడ్డంగా ... [news_tags_keywords] =>    bribe,Ongole [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/PxYH0bVtiHc [news_videoinfo] => |https://www.youtube.com/embed/PxYH0bVtiHc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 08:55:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అరకోటి పనికి రూ.2 లక్షలు ఇవ్వలేవా? - He was found asking for a bribe - EENADU
close

తాజా వార్తలు

అరకోటి పనికి రూ.2 లక్షలు ఇవ్వలేవా?

లంచం అడుగుతూ వీడియోలో దొరికిన  దివ్యాంగుల శాఖాధికారి 
విచారణకు ఆదేశించిన ప్రకాశం కలెక్టర్‌

ఒంగోలు: దివ్యాంగ సంక్షేమ శాఖ ద్వారా నడిచే వృద్ధుల డేకేర్‌ కేంద్రాల అనుమతుల కోసం లంచం అడుగుతూ ప్రకాశం జిల్లా దివ్యాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు అడ్డంగా దొరికిపోయారు. ‘రూ.50 లక్షల ప్రాజెక్టుకు రూ.రెండు లక్షలు ఇవ్వలేవా? నువ్వు ఇలా చెప్పుకొనే రెండు నెలలు వృథా చేసుకున్నావు. పది రూపాయలు వచ్చే పనిలో ఐదు రూపాయలు వదులుకోవాలి. నువ్వు చెప్పిన విధంగానే పరిశీలించాను, నివేదిక ఇచ్చాను. సరే ఒకటి (లక్ష) ఇవ్వు’ అంటూ ఆ అధికారి మాట్లాడినదంతా వీడియోలో రికార్డ్‌ అయింది. సాక్షాత్తూ ప్రభుత్వ కార్యాలయంలోనే లంచం బేరాలు నడవడం గమనార్హం. ప్రసాద్‌ అనే వ్యక్తి డేకేర్‌ కేంద్రాల నిర్వహణకు అనుమతులు కోరుతూ ఆ శాఖ సహాయ సంచాలకులు సింగయ్య చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నారు. రూ.రెండు లక్షలు ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో విసిగిపోయిన ప్రసాద్‌ సెల్‌ఫోన్‌లో వీడియో కెమెరా ఆన్‌ చేసి ఆ అధికారితో లంచం విషయమై మాట్లాడారు. అధికారికి తెలియకుండానే మొత్తం రికార్డ్‌ చేశారు. దాన్ని నేరుగా జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు పంపించారు. దీనిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సింగయ్య సెలవు పెట్టి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులోకి రావడం లేదు. ఈ అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దివ్యాంగ సమాఖ్య ప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.