close

తాజా వార్తలు

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం:ముగ్గురి మృతి 

భువనేశ్వర్‌: ఒడిశాలోని రాయగఢ్‌- కొరాపుట్‌ రైల్వే మార్గంలో సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఒకే లైనులో ఎదురెదురుగా వచ్చిన నిర్వహణ వ్యాన్‌, ఎక్స్‌ప్రెస్‌ రైలు పరస్పరం ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వేసిబ్బంది మృతిచెందారు. మృతులను సాగర్‌ (సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌), గౌరునాయుడు (ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌), సురేశ్‌ (టెక్నీషియన్‌)గా గుర్తించారు. ఈ మేరకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రకటించింది.  ఈ ప్రమాదంలో నిర్వహణ వ్యానులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌, రెండు ప్రయాణీకుల జనరల్‌ బోగీలతో పాటు లగేజ్‌ బోగీలోనూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నిర్వహణ వ్యానులోని ముగ్గురు మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మంటలను చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో సింగ్‌పూర్‌ రోడ్‌, కెబిటిగూడ స్టేషన్‌ మాస్టర్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. హావ్‌డా నుంచి జగదల్‌పూర్‌ వైపు సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుండగా.. కెబిటిగూడ వద్ద ఈ సాయంత్రం 4.30గంటలకు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. 148 మంది ప్రయాణీకులను బస్సుల్లో రాయగఢకు తరలిస్తున్నట్టు తెలిపారు. 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.