Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 130748
            [news_title_telugu_html] => 

అన్న అడుగుల్లోనే సైన్యంలోకి తమ్ముళ్లు..

[news_title_telugu] => అన్న అడుగుల్లోనే సైన్యంలోకి తమ్ముళ్లు.. [news_title_english] => Murdered rifleman Aurangzeb’s brothers join army vow to avenge his death [news_short_description] => ‘ఔరంగజేబ్‌’ అతనొక భారతదేశ సైనికుడు. గతేడాది దేశ సేవలో భాగంగా విధులు నిర్వర్తించి రంజాన్‌ పండగ కోసం పూంచ్‌లో ఉన్న తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వస్తుండగా ఆ సైనికుడిని మార్గమధ్యలో పుల్వామా వద్ద ఉగ్రవాదులు అపహరించి ఘోరంగా హతమార్చారు. [news_tags_keywords] => soldier,brothers,army [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-24 00:14:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అన్న అడుగుల్లోనే సైన్యంలోకి తమ్ముళ్లు.. - Murdered rifleman Aurangzeb’s brothers join army vow to avenge his death - EENADU
close

తాజా వార్తలు

అన్న అడుగుల్లోనే సైన్యంలోకి తమ్ముళ్లు..

శ్రీనగర్‌: ‘ఔరంగజేబ్‌’ అతనొక భారతదేశ సైనికుడు. గతేడాది దేశ సేవలో భాగంగా విధులు నిర్వర్తించి రంజాన్‌ పండగ కోసం పూంఛ్‌లో ఉన్న తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వస్తుండగా ఆ సైనికుడిని మార్గమధ్యలో పుల్వామా వద్ద ఉగ్రవాదులు అపహరించి ఘోరంగా హతమార్చారు. ఈ ఘటనతో అతని కుటుంబంతో పాటు దేశం యావత్తు ఎంతో తల్లడిల్లిపోయింది. అయినా అతని తండ్రి ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా తన మరో ఇద్దరు కుమారులను దేశ సేవ కోసం సైన్యంలోకి పంపేందుకు సిద్ధమయ్యారు. ఆ ఇద్దరు సోదరులు సైతం దేశానికి సేవలందించేందుకు సిద్ధమంటూ సైన్యంలో అడుగేస్తున్నారు. వారే మహమ్మద్ తారిఖ్‌, మహమ్మద్‌ షబ్బీర్‌, వారిద్దరూ సోమవారం రాజౌరీలోని సైనిక శిబిరంలో కొత్తగా నియామకమైన సైనికుల పరేడ్‌లో పాల్గొన్నారు. 

సైనిక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ తారిఖ్‌(23), మహమ్మద్‌ షబ్బీర్‌(21) ఇద్దరూ రాజౌరీలోని సైనిక శిబిరంలో కొత్తగా నియామకమైన వంద మంది సైనికుల పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం వారు శిక్షణ నిమిత్తం పంజాబ్‌ రెజిమెంటల్‌ కేంద్రానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మా అన్న దేశ సేవ కోసం ప్రాణాలర్పించారు. ఆయన అడుగు జాడల్లోనే మేము కూడా దేశ సేవకే అంకితమవుతామని అన్నారు. తన ఇద్దరు కుమారులు  సైన్యంలో చేరి దేశ సేవ చేస్తారని, తమ అన్నను చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటారని వారి తండ్రి హనీఫ్‌ అన్నారు. 
2018, జూన్‌ 14న ఔరంగజేబ్‌ అనే సైనికుడిని రంజాన్‌ పండగ కోసం విధుల నుంచి ఇంటికి వస్తుండగా, పుల్వామా వద్ద ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఔరంగజేబ్‌ తండ్రి హనీఫ్‌ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో భాజపాలో చేరారు. ఇతను కూడా గతంలో సైన్యంలో సేవలందించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.