close

తాజా వార్తలు

రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక ఏకగ్రీవం

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసేలోపు ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మన్మోహన్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయన పేరును రాజ్యసభకు ప్రతిపాదించగా.. భారతీయ జనతా పార్టీ ఎవరినీ బరిలోకి దింపలేదు. భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్‌ సైనీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. గతంలో ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించిన మన్మోహన్‌ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 14తో ముగిసింది.

 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.