close

తాజా వార్తలు

స్థలం తమదేనంటూ వట్టి వసంత్‌ బెదిరింపులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు 

విశాఖపట్నం: సొంత స్థలానికి రక్షణగా గేటు ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ తనను బెదిరించారని బీఎస్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి విశాఖపట్నంలోని అరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి వద్ద రివాల్వర్‌ కూడా ఉందని, దానిని చూపిస్తూ తనపైకి వస్తూ బెదిరించారని తెలిపారు. సాగర్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న ఆ స్థలం తనది కాదంటున్నారని ప్రసాద్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఆ స్థలం వసంత కుమార్‌ది కూడా కాదని పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వసంత కుమార్‌పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.