close

తాజా వార్తలు

సూర్యాపేటలో రెండు కార్లు దగ్ధం

మునగాల రూరల్‌: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వార్తాపత్రిక రిపోర్టర్‌ నరేందర్‌ భార్యతో కలిసి కోదాడ నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వెళ్తుండగా.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్‌ దాటి వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లూ పూర్తిగా దగ్ధమాయ్యయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.