close

తాజా వార్తలు

ఆన్‌లైన్‌ డేటింగ్‌.. విశాఖ యువకులకు వల

ఎంవీపీ కాలనీ: కోల్‌కతా కేంద్రంగా ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తూ విశాఖ యువకులకు వల విసురుతున్న పలువురు యువతుల్ని క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విశాఖలో ఈ తరహా కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన సైబర్ ‌క్రైం సీఐ గోపీనాథ్‌ నేతృత్వంలోని బృందం కోల్‌కతా వెళ్లి దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్ నిర్వాహకులతో పాటు  26 మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ ముఠా విశాఖలో ఒకరి నుంచి రూ.18 లక్షలు మరొకరి నుంచి రూ. 3లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఈ ముఠా బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠా నుంచి  3 ల్యాప్‌టాప్‌లు, 40 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ కోల్‌కతా కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు వెల్లడించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.